మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2020-03-23T09:27:29+05:30 IST

కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని పరిశీలనలో వుంచేందుకు మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నట్టు...

మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లు

  • విమ్స్‌లో మరో 400 పడకలు
  • ఏఎంసీలో 250 పడకలు, మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఏర్పాటు 
  • జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని పరిశీలనలో వుంచేందుకు మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. ప్రస్తుతం విమ్స్‌లో 400 పడకలతో క్వారంటైన్‌ సెంటర్‌ అందుబాటులో వుందని, అక్కడ ప్రస్తుతం 22 మంది ఉన్నారన్నారు. విమ్స్‌లోనే అదనంగా మరో 400 పడకలతో మరో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామని, ఆంధ్ర వైద్య కళాశాలలో 250 పడకలు సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా ప్రాంతీయ కంటి ఆసుపత్రి, మెంటల్‌ కేర్‌ ఆసుపత్రి, గీతం ఆసుపత్రిలో మరిన్ని పడకలు ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. జిల్లాలో 62 ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ బెడ్స్‌ ఏర్పాటుకు పరిశీలించామన్నారు. 


Updated Date - 2020-03-23T09:27:29+05:30 IST