మావోయిస్టుల ప్రోత్సాహంతోనే గంజాయి సాగు

ABN , First Publish Date - 2020-12-10T05:37:53+05:30 IST

మావోయిస్టుల ప్రోత్సాహంతోనే విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతోందని రూరల్‌ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు.

మావోయిస్టుల ప్రోత్సాహంతోనే గంజాయి సాగు
రూరల్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావు

 రూరల్‌ ఎస్పీ  కృష్ణారావు

నర్సీపట్నం, డిసెంబరు 9 : మావోయిస్టుల ప్రోత్సాహంతోనే విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతోందని రూరల్‌ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. గిరిజనుల  క్షేమం కోరేవారే అయితే,  గంజాయిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.  ఇటీవల మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమని గిరిజనులు గ్రహించినట్టు చెప్పారు. దళంలోకి ఎవరూ వెళ్లడం లేదని, మావోయిస్టులంటే వారికి భయం పోయిందని వివరించారు. గిరిజనులు ఉపాధి, ఉద్యో గావకాశాలు వెతుక్కుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వంద మంది గిరిజనులకు శిక్షణ ఇచ్చి, సీఆర్‌పీఎఫ్‌లోకి తీసుకు న్నట్టు చెప్పారు. పోలీసుల నిఘా వల్ల గతంతో పోల్చుకుంటే గంజాయి స్మగ్లింగ్‌ తగ్గిందన్నారు. గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌ఈబీ కూడా గంజాయి రవాణాను అడ్డుకుంటున్నట్టు చెప్పారు. అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మారుమూల ప్రాంతంలో గంజాయి లిక్విడ్‌ తయారు చేసే మిషన్లు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశామన్నారు. 

అంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గత ఐదారు సంవత్సరాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం 25శాతం మాత్రమే గంజాయి సాగు  జరుగుతుందని ఎస్పీ వివరించారు. గత పదేళ్లుగా పోలీస్‌ స్టేషన్లలో నిల్వ ఉన్న 82,430కిలోల గంజాయిని డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో దహ నం చేసినట్టు చెప్పారు.  అత్యధికంగా కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌లోని 67 కేసుల్లో 10,455 కిలోలు, చింతపల్లిలో 65 కేసుల్లో 6,307 కిలోలు, నర్సీపట్టణ పోలీస్‌ స్టేషన్‌లో 50 కేసుల్లో 4,981 కిలోల గంజాయిని దహనం చేశామని వివరించారు. 

Updated Date - 2020-12-10T05:37:53+05:30 IST