-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » MLC Budha Pressmeet
-
టీడీపీ పోరాటంతోనే పేదలకు ఇళ్లు
ABN , First Publish Date - 2020-11-22T05:08:39+05:30 IST
టీడీపీ పోరాటంతో జగన్ సర్కారు దిగొచ్చి పేదలకు టిడ్కో ఇళ్ల పంపిణీకి పూనుకుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

ఎమ్మెల్సీ బుద్ద నాగదీశ్వరరావు
అనకాపల్లి, నవంబరు 21: టీడీపీ పోరాటంతో జగన్ సర్కారు దిగొచ్చి పేదలకు టిడ్కో ఇళ్ల పంపిణీకి పూనుకుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు చేపట్టిన ‘నా ఇల్లు-నా సొంతం... నా ఇంటి స్థలం-నాకు ఇవ్వాలి’ అనే కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు ఒక యజ్ఞంలా నిర్వహించారని కొనియాడారు.
ఇన్ని రోజులూ కోర్టుల్లో కేసులతోనే వాయిదా వేశామని జగన్‌రెడ్డి అండ్ పేమెంట్ బ్యాచ్ చెప్పుకున్నారని, ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యాయని బుద్ద ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీపై చేసిన దుష్ప్రచారానికి వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కొని అమాయక రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో కులమతాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఇప్పుడా పరిస్థితి లేదని బుద్ద పేర్కొన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు కొణతాల వెంకటరావు, కుప్పిలి జగన్, బోడి వెంకటరావు ఉన్నారు.