ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్‌ : ఎమ్మెల్సీ బుద్ద

ABN , First Publish Date - 2020-03-30T10:34:32+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

ఆదర్శప్రాయుడు ఎన్టీఆర్‌ : ఎమ్మెల్సీ బుద్ద

అనకాపల్లి, మార్చి 29 : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి పార్క్‌ సెంటర్‌లో గల ఆయన విగ్రహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు.  పార్టీని స్థాపించిన తరువాత పేద, బడుగు, బలహీనవర్గాలకు సామాజిక న్యాయం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు వెనుకబడిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.  మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ వంటి పండగ దినాల్లో కానుకలిచ్చి అన్ని వర్గాల్లో సంతోషం నింపేవారని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేవారన్నారు.  మాజీ కౌన్సిలర్‌ బీఎస్‌ఎంకే జోగినాయుడు, పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, మళ్ల శ్రీరాములు, కొణతాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:34:32+05:30 IST