గ్రామాల్లో ఎమ్మెల్యే పాదయాత్ర
ABN , First Publish Date - 2020-11-16T04:09:58+05:30 IST
యువతను సాంకేతికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం త్వరలో రేబాక పాలిటెక్నిక్ కళాశాలను ఆనుకుని రూ.45 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాలను నిర్మించనున్నట్టు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

అనకాపల్లి రూరల్, నవంబరు 15: యువతను సాంకేతికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం త్వరలో రేబాక పాలిటెక్నిక్ కళాశాలను ఆనుకుని రూ.45 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాలను నిర్మించనున్నట్టు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. మండలంలో ని శంకరం, రేబాక గ్రామాల్లో ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లిసూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజలలో నాడు- ప్రజల కోసం నేడు పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు శంకరంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నొట్ల శేఖర్, సేనాపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.