తక్షణమే ధరలు తగ్గించాలి: ఎమ్మెల్యే వెలగపూడి

ABN , First Publish Date - 2020-11-06T18:52:18+05:30 IST

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

తక్షణమే ధరలు తగ్గించాలి: ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖపట్నం: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో మహిళలు నిరసనలో పాల్గొన్నారు. ధరలు తగ్గించాలని నినాదాలు చేపడుతూ....ప్ల కార్డులు ప్రదర్శించారు. టీడీపీ హయాంలో నిత్యావసర, కాయగూర ధరలు..ఇప్పుడు వైసీపీ హయాంలో ధరలను పోల్చుతూ పెద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు  మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. టీడీపీ హయాంలో సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండేవని..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. ఒక చేతితో డబ్బులు ఇచ్చి.. మరో చేతితో  తీసుకుంటోందని ఆరోపించారు. తక్షణమే ధరలను తగ్గించాలని ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-06T18:52:18+05:30 IST