గ్రేటర్‌ పీఠం దక్కించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-20T05:08:25+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

గ్రేటర్‌ పీఠం దక్కించుకోవాలి
కమిటీ సభ్యులను అభినందిస్తున్న గంటా

అదే లక్ష్యంగా పనిచేయండి

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గంటా పిలుపు

కంచరపాలెం, డిసెంబరు 19: జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నర్సింహనగర్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి బాధ్యత పార్టీ వార్డు అధ్యక్షులదేనని తెలిపారు. విజయంపై పూర్తి బాధ్యత తీసుకున్న వారినే అధ్యక్షులుగా నియమిస్తున్నామని, వారు స్థానిక సమస్యలపై దృష్టిసారించి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులను గంటా అభినందించారు. 


Read more