-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » MLA Dharmsri padhayatra
-
సొంతింటి కల త్వరలోనే సాకారం
ABN , First Publish Date - 2020-12-11T05:22:22+05:30 IST
పేదల సొంతింటి కల త్వరలోనే సాకారం చేస్తామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు.

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
చోడవరం, డిసెంబరు 10: పేదల సొంతింటి కల త్వరలోనే సాకారం చేస్తామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. మండలంలోని ఖండేపల్లి, మైచర్లపాలెం, దామునాపల్లి, లక్ష్మీపురం, గవరవరం, లక్కవరం, సింహాద్రిపురం, జుత్తాడ, గజపతినగరం గ్రామాల్లో గురువారం పాదయాత్ర చేశారు. లక్ష్మీపురం, గజపతినగరం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో ఆయన మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ నెల 25న ఇంటి పట్టాతో పాటు మంజూరు ధ్రువపత్రం కూడా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్మించే కాలనీల్లో విద్యుత్, తాగునీరు, రహదారుల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో శ్యాంసుందర్, నాయకులు శ్రీకాంత్, ఏడువాక సత్యారావు, పల్లా నరసింగరావు, సేనాపతి సత్యారావు, గణపతినాయుడు పాల్గొన్నారు.