పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
ABN , First Publish Date - 2020-12-30T05:35:10+05:30 IST
పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
రోలుగుంట/రావికమతం, డిసెంబరు 29: పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రోలుగుంట, రావికమతం మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ, పేదోళ్ల కష్టాలను తీర్చడానికి, అర్హులందరికీ పక్కా గృహాల మంజూరుకు జగన్ పూనుకున్నారన్నారు. ఇళ్ల పట్టాల మంజూరు నిరంతర పక్రియని, మిగిలిన అర్హులకు కూడా పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్‌లు కృష్ణమూర్తి, కనకారావు, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి ముక్కా మహాలక్ష్మినాయుడు, వైసీపీ నాయకులు మడ్డు అప్పలనాయుడు, కంచిపాటి జగన్నాఽథరావు, తమరాన వెంకటరమణ, వెంకట్, గుమ్మడి సత్యదేవా, పతివాడ చిన్నంనాయుడు, సేలం శంకరరావు, బలిరెడ్డి రాజు, నక్క చంటి పాల్గొన్నారు.