పేదోళ్ల సొంతింటి కల సాకారం

ABN , First Publish Date - 2020-12-27T05:22:40+05:30 IST

అర్హులైన నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.

పేదోళ్ల సొంతింటి కల సాకారం
లబ్ధదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ


రావికమతం/రోలుగుంట: అర్హులైన నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మండలంలోని చినపాచిల, గుమ్మాళ్ళపాడు, కొమిర, కవ్వగుంట పంచాయతీలకు చెందిన లబ్ధదారులకు చినపాచిల గ్రామంలోను, రోలుగుంట మండలానికి సంబంధించి వడ్డిన, బుచ్చెంపేట, రత్నంపేట, బీబీపట్నం, ఎం.కె.పట్నం, అర్ల, రాజన్నపేట గ్రామాల లబ్ధిదారులకు వడ్డిప గ్రామంలో శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 5,283 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ దశల వారీగా పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి పద్మలత, తహసీల్దార్‌ కనకారావు, ఎంపీడీవో రామచంద్రమూర్తి, వైసీపీ మండల అధ్యక్షులు కె.జగన్నాథరావు, మడ్డు అప్పలనాయుడు, డీసీఎంఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి ముక్కా మహాలక్ష్మినాయుడు, నాయకులు కె.ప్రసాద్‌, గొర్లె రవికుమార్‌, రాము, సిహెచ్‌.వెంకునాయుడు, పోతల గౌరీశంకర్‌, తమటపు వెంకునాయుడు, రాజునాయుడు, గరగా సత్యవతి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:22:40+05:30 IST