-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » mla angre about pharma companies
-
ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తప్పవు
ABN , First Publish Date - 2020-11-01T04:54:40+05:30 IST
పరవాడ పెద్ద చెరువులో చేపలు చనిపోవడానికి కారణమైన ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే అదీప్‌రాజ్ హామీ
పరవాడ, అక్టోబరు 31: పరవాడ పెద్ద చెరువులో చేపలు చనిపోవడానికి కారణమైన ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన పరవాడ పెద్ద చెరువును ఆయకట్టు రైతులతో కలిసి పరిశీలించారు. చేపలు మృతి చెంది చెరువు నిండా కనిపించడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరవాడ ప్రాంతంలో గల చెరువులన్నింటిని క్లోరినేషన్ చేయిస్తామన్నారు. ఫార్మా వ్యర్థ జలాలు చెరువుల్లో కలవకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, ఆయకట్టు రైతులు పైలా రామచంద్రరావు, రెడ్డి శ్రీను, స్థానిక మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శిరపురపు అప్పలనాయుడు, పైలా హరీశ్, చీపురుపల్లి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.