వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-06T05:52:45+05:30 IST

మండలంలోని శొంఠ్యాం గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్టు శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది.

వివాహిత అదృశ్యం

ఆనందపురం, డిసెంబరు 5: మండలంలోని శొంఠ్యాం గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్టు శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ వై.రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శొంఠ్యాం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసగుప్తాకు 16 ఏళ్ల కిందట అనురాధ (37)తో వివాహం కాగా 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే అనురాధకు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో వైద్యులకు చూపిస్తున్నారు. కాగా ఈనెల ఒకటిన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనురాధ తిరిగి రాకపోవడంతో శ్రీనివాసగుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.


హెచ్‌బీకాలనీలో యువతి.. 

ఎంవీపీ కాలనీ: నగరంలోని హెచ్‌బీ కాలనీ సింహద్రిపురంలో నివాసం ఉంటున్న డొంకాన చిన్ని (19) అనే యువతి అదృశ్యమైనట్టు ఎంవీపీ జోన్‌ పోలీసులు తెలిపారు. ఈనెల నాలుగున తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చిన్ని తన దుస్తులు, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో చిన్ని తండ్రి తమ్మయ్య ఫిర్యాదు మేరకు హెచ్‌సీ గంగాధర్‌ యాదవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T05:52:45+05:30 IST