ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

ABN , First Publish Date - 2020-12-11T05:10:54+05:30 IST

ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యమయ్యారు.

ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం
ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చినబాబు (ఫైల్‌ ఫొటో)

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 10: ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యమయ్యారు. జోన్‌ సీఐ రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పొందూరులోని కృష్ణాపురం గ్రామానికి చెందిన అంబళ్ల చినబాబు (36) విశాఖ యూనిట్‌లో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయన మంగాపురం కాలనీలోని తారామసీద్‌ వద్ద ఒక రూమ్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. ఈనెల నాలుగున డ్యూటీ లేకపోవడంతో రూమ్‌లోనే ఉన్న ఆయన సాయంత్రం ఆరున్నరప్పుడు బయ టకు వెళ్లి మళ్లీ రూమ్‌కు చేరుకోలేదు. అయితే చినబాబు ఆ మరుసటి రోజు విధులకు హాజరు కాకపోవడంతో ఆయన సోదరుడు శ్రీనివాసరావు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం ఎంవీపీ జోన్‌ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. హెచ్‌సీ రుద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T05:10:54+05:30 IST