పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ABN , First Publish Date - 2020-11-25T05:49:55+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేద్దామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
శిలాఫలకాలను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సాగర్‌నగర్‌, నవంబరు 24: పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేద్దామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పార్కుల ప్రహరీలు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు, తదితర అభివృద్ధి పనులకు మంగళవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం బీచ్‌రోడ్డులోని పార్కులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా 98వ వార్డులో పార్కుల అభివృద్ధికి జీవీఎంసీ పెద్దపీట వేస్తుందన్నారు. కొవిడ్‌ పరిశోధనల్లో మనదేశం అవలంభిస్తున్న సనాతన ధర్మం గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు తెలుస్తోందన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలకు మించి ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న మహా నేతగా సీఎం జగన్‌ నిలిచారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘గీతం’ కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ నాయకుడు చెన్నాదాసు మాట్లాడుతూ జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని మంత్రి ముందే ఆరోపించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముత్తంశెట్టి మహేశ్‌, నొడగల అప్పారావు, నొడగల రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more