-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » MINISTER MEETING
-
మధురవాడ ప్రాంతం కీలకం
ABN , First Publish Date - 2020-12-15T06:00:58+05:30 IST
పరిపాలనా రాజధానిగా విశాఖ మారనున్న నేపథ్యంలో మధురవాడ ప్రాంతం చాలా కీలకంగా మారనున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
కొమ్మాది, డిసెంబరు 14: పరిపాలనా రాజధానిగా విశాఖ మారనున్న నేపథ్యంలో మధురవాడ ప్రాంతం చాలా కీలకంగా మారనున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం శిల్పారామంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధురవాడకు ఒకపక్క ఐటీ సెజ్, మరోపక్క రుషికొండ బీచ్, హైవే వంటి హంగులు ఉన్నందున రాబోయే రోజుల్లో హైదారాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లా విరాజిల్లుతుందన్నారు. పరిపాలనా రాజధాని తర్వాత అనేక కంపెనీలు తరలివస్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మధురవాడ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యాక్షన్ ప్లాన్‌లో రోడ్లు, కాలువలు, తాగునీరు, శానిటేషన్ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను వైసీపీ కార్యకర్తలు మంత్రికి ఏకరువు పెట్టగా, వాటిని ఎన్ని రోజుల్లోగా పరిష్కారం చేస్తారో అధికారుల నుంచే సమాధానాలిప్పించారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జడ్సీ రాము, తదితరులు పాల్గొన్నారు.