అవగాహనతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2020-11-25T06:05:23+05:30 IST

గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షమ కార్యక్రమాల్లో అధికారులు, వైసీపీ నాయకులు సమన్వయ అవగాహనతో ముందుకు సాగాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు.

అవగాహనతో ముందుకు సాగాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం, నవంబరు 24: గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షమ కార్యక్రమాల్లో అధికారులు, వైసీపీ నాయకులు సమన్వయ అవగాహనతో ముందుకు సాగాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం భీమిలి క్యాంప్‌ కార్యాలయంలో వివిధ శాఖల మండల అధికారులు, వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోను ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి వివరాలను అధికారుల వద్ద తీసుకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ధీమాగా ఉంటే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఈ సమావేశానికి అధికారులు, కార్యదర్శులతో పాటు సర్పంచ్‌, ఎంపీటీసీ పోటీ అభ్యర్థులు స్వల్ప సంఖ్యలో హాజరవ్వడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భీమిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దాట్ల పెదబాబు, ఎంపీపీ అభ్యర్థి దంతులూరి వాసురాజు, పార్టీ మండల అధ్యక్షుడు చెల్లూరి పైడప్పడు, యలమంచిలి సూర్యనారాయణ, తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు, ఎంపీడీవో పి.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T06:05:23+05:30 IST