అన్నిరంగాల్లో విశాఖ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-11-21T05:37:44+05:30 IST

‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’గా వెలుగొందుతున్న విశాఖను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

అన్నిరంగాల్లో విశాఖ అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు

మహారాణిపేట, నవంబరు 20: ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’గా వెలుగొందుతున్న విశాఖను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు  తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.


అన్నిరంగాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పబ్లిక్‌ సెక్టార్‌, పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలతోపాటు నగరాభివృద్ధిపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, బి.సత్యవతి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, గ్రేటర్‌ కమిషనర్‌ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు కన్నబాబు, గొల్లబాబూరావు, వాసుపల్లి గణేష్‌కుమార్‌, గుడివాడ అమర్‌నాథ్‌, అదీప్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read more