మాస్క్‌ లేకుండా రోడ్డెక్కితే రూ.100 జరిమానా

ABN , First Publish Date - 2020-07-19T18:32:25+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించేలా..

మాస్క్‌ లేకుండా రోడ్డెక్కితే రూ.100 జరిమానా

7,238 మందికి జరిమానా విధించిన పోలీసులు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించేలా చేయడంలో భాగంగా మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. గత నెల 26 నుంచి శనివారం వరకూ మాస్క్‌లేకుండా రోడ్డుపైకి వచ్చిన 7,238 మంది నుంచి రూ.వంద జరిమానాతోపాటు సర్వీసు ఛార్జీ కింద రూ.20 చొప్పున రూ.8,68,560 జరిమానా విధించారు. పాదచారులు ఎవరైనా మాస్క్‌లేకుండా బయటకు వస్తే నేరుగా వారి నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. అదే ద్విచక్రవాహనం లేదా ఆటో, కారు వంటి వాహనాల్లో ప్రయాణించేవారెవరైనా మాస్క్‌పెట్టుకోనట్టయితే ఆ వాహనం నంబర్‌తో ఈ ఛలాన్‌ జారీచేస్తున్నారు. దీనివల్ల ఆయా వాహనాల్లో ప్రయాణించేవారంతా మాస్కు పెట్టుకునేలా వాహనం యజమానే జాగ్రత్త పడతారన్నది పోలీసుల భావన. 


Updated Date - 2020-07-19T18:32:25+05:30 IST