మన్యం... నిర్బంధం

ABN , First Publish Date - 2020-03-24T09:19:15+05:30 IST

మన్యంలో లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యా లయం నుంచి ఏజెన్సీలోని...

మన్యం... నిర్బంధం


23పీడీఆర్‌11 : మన్యం అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో డీకే బాలాజీ


  •  లాక్‌ డౌన్‌ ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
  •  ప్రైవేటు వాహనాలను నడవనివ్వొద్దు
  •  సరదాగా బైక్‌లపై తిరిగే వాళ్లపై కేసులు పెట్టండి 
  •  అధికారులకు ఐటీడీఏ పీవో ఆదేశం
  •  రెవెన్యూ, పోలీస్‌, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌

పాడేరు, మార్చి 23 : మన్యంలో  లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించాలని ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యా లయం నుంచి ఏజెన్సీలోని పదకొండు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్‌ అధికారులతో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు సమన్వ యంతో పని చేయాలని సూచించారు. ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేయా లని, తహసీల్దార్లు అధికా రాలను  వినియోగించాలని సూచించారు. పోలీ సుల సహకారంతో నిబంధనలు ఉల్లం ఘించి, అనవస రంగా బైక్‌లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేయాల న్నారు. పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఏజెన్సీకి వచ్చే వారిపై  ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. అవసరమైన వారిని ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.


చెక్‌పోస్టుల వద్ద మరింత అప్రమత్తం కావాలి

చిలకలగెడ్డ,  గరిక బంద, డౌనూ రుల వద్ద ఇప్పటికే చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని, సోమవారం జోలాపుట్టు, జైపూర్‌ కూడలి, కృష్ణా దేవిపేటల వద్ద ఏర్పాటైనట్టు చెప్పారు.  అక్కడ మరింత అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం ఏజెన్సీకి వచ్చే ప్రయాణి కులను తనిఖీ చేసి అనుమా నితు లను గుర్తిస్తే  తిరిగి మైదానానికి పంపించాలన్నారు. అలాగే అనుమా నిత కేసులను గుర్తిస్తే  వెంటనే విశాఖపట్నం విమ్స్‌లో చేర్పించాలని సూచించారు. కరోనా వైరస్‌పై అవగాహనకు గిరిజన గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more