రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-21T05:13:10+05:30 IST

ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి కరాస ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మృతుడు వినోద్‌కుమార్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌, డిసెంబరు 20: ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దరి కరాస ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపట్నానికి చెందిన వినోద్‌ కుమార్‌ సాహు(28) పోర్టులో కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. అతను మర్రిపాలెం నుంచి ఎన్‌ఏడీ కూడలి వైపు బైక్‌పై వస్తుండగా కరాస ప్రాంతంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎయిర్‌పోర్ట్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-21T05:13:10+05:30 IST