-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Man commit suicide after wife went from home
-
పిల్లలతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య.. ఆ భర్త ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2020-06-22T15:47:05+05:30 IST
భార్య, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారనే మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో పెనుమంచి రమణ

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
తాటిచెట్లపాలెం (విశాఖ): భార్య, పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారనే మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో పెనుమంచి రమణ (35) భార్య రమణమ్మ ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. టైల్స్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇటీవల అతడి భార్య పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇలానే వెళ్లిపోయి, కొద్దిరోజుల తరువాత తిరిగి వచ్చిందని, తరచూ ఇలానే వెళ్లిపోతుండడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడు రామునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.