-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » malleswara rao
-
సింహాచల దేవస్థానం ఈఈ బదిలీ
ABN , First Publish Date - 2020-05-18T09:14:18+05:30 IST
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న బి.మల్లేశ్వరరావును విజయవాడ సమీపంలోని

సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న బి.మల్లేశ్వరరావును విజయవాడ సమీపంలోని పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానానికి బదిలీ చేశారు. సుమారు 26 ఏళ్ల కిందట వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో విధుల్లో చేరిన ఆయన తర్వాత కాలంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా, డిప్యూటీ ఇంజనీర్‌గా, ప్రస్తుతం కార్యనిర్వాహక ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంచి అధికారిగా పేరొందిన ఆయన తాజాగా దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అంశాలపై ఇబ్బందులకు గురవ్వడంతో స్వయంగా బదిలీ చేయించుకున్నట్టు తెలుస్తోంది.