కులం కార్డుతో మహేశ్‌ దందాలు

ABN , First Publish Date - 2020-08-12T10:11:48+05:30 IST

ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేశ్‌ కులం కార్డు అడ్డం పెట్టుకుని దందాలు చేస్తూ వర్సిటీ పేరు ప్రతిష్టలను దిగజారుసున్నాడని పలువురు..

కులం కార్డుతో మహేశ్‌ దందాలు

ఏయూ దళిల ప్రొఫెసర్ల ఆరోపణ


ఏయూ క్యాంపస్‌, ఆగస్టు11: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేశ్‌ కులం కార్డు అడ్డం పెట్టుకుని దందాలు చేస్తూ వర్సిటీ పేరు ప్రతిష్టలను దిగజారుసున్నాడని పలువురు దళిత ప్రొఫెసర్లు ఆరోపించారు. మంగళవారం ఏయూలో జరిగిన విలేఖరుల సమావేశంలో దళిత ప్రొఫెసర్లు ఎన్‌.సత్యనారాయణ, షారన్‌రాజు, సిద్ధయ్య, సత్యనారాయణలు ‘సేవ్‌ ఏయూ’ అనే పోస్టర్లను ప్రదర్శించి మాట్లాడారు. మహేశ్‌ను గత వీసీ బీరా సత్యనారాయణ ప్రవర్తన సరిగ్గా లేదని సస్పెండ్‌ చేశారని, ఆ తర్వాత రీ అడ్మిషన్‌ తీసుకోలేదని, అందువల్ల వర్సిటీ యాక్టివ్‌ రోల్స్‌లోకి ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. స్వలాభం కోసం చేస్తున్న దొంగ దీక్ష చేస్తున్న మహేశ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-12T10:11:48+05:30 IST