మూడు రోడ్లకు మహర్దశ

ABN , First Publish Date - 2020-11-28T06:14:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది.

మూడు రోడ్లకు మహర్దశ
అభివృద్ధి చేయనున్న కశింకోట-బంగారుమెట్ట రోడ్డు

విస్తరణ, అభివృద్ధి పనులకు

రూ.68 కోట్ల కేంద్రం నిధులు

పరిపాలనా ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం


విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది. కశిం కోట-బంగారుమెట్ట (బుచ్చెయ్యపేట మండలం) 24.065 కిలోమీటర్ల రోడ్డుకు రూ.32 కోట్లు, జాతీయ రహదారి నుంచి పద్మనాభం మండలం రేవిడి వెంకటా పురం నుంచి ఐనాడ, కోరాడ, మజ్జిపేట మీదుగా విజయనగరం- రాయ్‌పూర్‌ జాతీయ రహదారిని కలుపుతూ 11.560 కి.మీ. రోడ్డుకు రూ.16 కోట్లు, చోడవరం మండలం గవరవరం నుంచి దేవరాపల్లి మండలం కాశీపురం వరకు 15.295 కి.మీ. రోడ్డుకు రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.

Updated Date - 2020-11-28T06:14:33+05:30 IST