శాశ్వత రోడ్డు నిర్మాణానికి కృషి : ప్రభుత్వ విప్ బూడి
ABN , First Publish Date - 2020-12-15T05:44:51+05:30 IST
పినగాడి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లలపాలెం తారురోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు సోమవారం కొలతలు వేయించారు.
కె.కోటపాడు: పినగాడి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లలపాలెం తారురోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు సోమవారం కొలతలు వేయించారు. తారురోడ్డుతోపాటు డ్రైనేజీల నిర్మాణానికి అవసరమయ్యే ప్రతిపాదనలు తయారుచేసి అందజేయా లని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు రెడ్డి జగన్మోహన్, ఎ. రామునాయుడు, బండారు ముత్యాలనాయుడు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
వార్డెన్ నియామకానికి కృషి
చీడికాడ: మంచాల మోడల్ కళాశాల హాస్టల్ వార్డెన్ నియామకానికి కృషిచేస్తానని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. మంచాల మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ చెరకాపు వెంకటలక్ష్మితోపాటు ఉపాధ్యాయులు విప్ బూడిని సోమవారం మధ్యాహ్నం కలిసి పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, మోడల్ కళాశాలలో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు బాలికలకు హాస్టల్ సదుపాయం ఉందన్నారు. పూర్తిస్థాయి వార్డెన్ నియామకానికి చర్యలు తీసు కోవాలని ఎమ్మెల్యేని కోరారు. దీనిపై స్పం దించిన మూత్యాలనాయుడు జిల్లా అధికా రులతో మాట్లాడి వార్డెన్ నియామకానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్‌ని కలిసిన వారిలో ఫిజిక్స్ టీచర్ హైమావతి, మాజీ ప్రిన్సిపాల్ హీరాలాల్, ఉపాధ్యాయులు నెల్లూరి ఉమామహేశ్వరరావు, డా.చంద్రశేఖరరావు, పాల్గొన్నారు.