లోయలో పడిన కారు

ABN , First Publish Date - 2020-11-20T04:37:39+05:30 IST

జి.మాడుగుల మండలం మత్స్యపురం సమీపంలో పర్యాటకుల కారు లోయలోకి బోల్తాపడిన ఘటనలో అనకాపల్లికి చెందిన ఐదుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి.

లోయలో పడిన కారు
లోయలోకి దూసుకుపోయిన పర్యాటకుల కారు

ఐదుగురు పర్యాటకులకు గాయాలు

పాడేరురూరల్‌(జి.మాడుగుల), నవంబరు 19: జి.మాడుగుల మండలం మత్స్యపురం  సమీపంలో పర్యాటకుల కారు లోయలోకి బోల్తాపడిన ఘటనలో అనకాపల్లికి చెందిన ఐదుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి కాలు విరిగింది. అనకాపల్లి నుంచి గురువారం ఉదయం అరకులోయ ప్రాంతాన్ని సందర్శించిన ఐదుగురు పర్యాటకులు అక్కడ నుంచి జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంకి వచ్చారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా మత్స్యపురం సమీపంలో మలుపు వద్ద కారు అదుపు తప్పడంతో లోయలోకి కారు దూసుకుపోయింది. క్షతగాత్రులు సంఘటనా స్థలం నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి వచ్చి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి తరలివెళ్లారు. ప్రమాద సంఘటనపై జి.మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-20T04:37:39+05:30 IST