బొగ్గు లారీ బీభత్సం
ABN , First Publish Date - 2020-12-14T05:17:22+05:30 IST
సబ్బవరంలో ఆదివారం తెల్లవారుజామున ఓ బొగ్గు లారీ అదుపు తప్పి కిరాణా దుకాణాల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

అదుపు తప్పి కిరాణా దుకాణాల్లోకి దూసుకుపోయి బోల్తా
ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం
సబ్బవరం, డిసెంబరు 13 : సబ్బవరంలో ఆదివారం తెల్లవారుజామున ఓ బొగ్గు లారీ అదుపు తప్పి కిరాణా దుకాణాల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి నుంచి పెందుర్తి వైపు బొగ్గు లోడ్‌తో వెళుతున్న ఓ లారీ స్థానిక శివాలయం మలుపు వద్ద ఆదివారం వేకువజామున అదుపు తప్పింది. రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొని రహదారి పక్కన ఉన్న డి.ప్రకాశ్, పెన్నం శ్రీనివాసరావులకు చెందిన కిరాణా దుకాణాల్లోకి దూసుకుపోయింది. శ్రీనివాసరావు దుకాణం పైకి వెళ్లి బోల్తా పడింది. అయితే డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయట పడ్డారు. విద్యుత్ తీగలు తెగిపడినా, లారీ అదుపు తప్పినా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా శ్రీనివాసరావు దుకాణం చాలా వరకు ధ్వంసమైంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.