లేళ్ల గృహ నిర్బంధం
ABN , First Publish Date - 2020-12-18T05:06:31+05:30 IST
అమరావతిలోని రాయపూడిలో జరిగే బహరంగ సభకు హాజరుకాకుండా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత లేళ్ల కోటేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు.

కూర్మన్నపాలెం, డిసెంబరు 17: అమరావతిలోని రాయపూడిలో జరిగే బహరంగ సభకు హాజరుకాకుండా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత లేళ్ల కోటేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం నుంచీ ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా లేళ్ల మాట్లాడుతూ ప్రభుత్వం పౌరుల హక్కులు కాల రాసి గృహ నిర్బంధాలు చేయడం దారుణమన్నారు. అంతి మ విజయం అమరావతి రైతులదేనని గుర్తించాలన్నారు.