భూమి లేని గిరిజనులను గుర్తించాలి

ABN , First Publish Date - 2020-12-28T05:30:00+05:30 IST

మన్యంలో వ్యవసాయ భూమి లేని గిరిజనులను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

భూమి లేని గిరిజనులను గుర్తించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌


ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

పాడేరు, డిసెంబరు 28: మన్యంలో వ్యవసాయ భూమి లేని గిరిజనులను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. సోమవారం ఆయన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, వెలుగు అధికారులతో ప్రభుత్వ పథకాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి లేని ప్రతీ గిరిజన కుటుంబానికి రెండు ఎకరాల భూమిని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములను గిరిభూమి పోర్టల్‌లో పొందుపరచాలన్నారు. ఈ సమావేశంలో వెలుగు ఏపీడీ మురళి, వ్యవసాయశాఖ ఏడీ రత్నకుమారి, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:30:00+05:30 IST