మూడు ఎకరాలు ప్రభుత్వానికి.. ఆరు ఎకరాలు రామాలయ నిర్మాణానికి దానం..

ABN , First Publish Date - 2020-06-25T19:24:20+05:30 IST

సెంటు స్థలం కనిపిస్తే ఎలా ఆక్రమించేద్దామా అని చూస్తున్న ఈ రోజుల్లో, ఏకంగా తొమ్మిది ఎకరాల భూమిని దానం చేసి ఔదార్యం చాటుకుంది

మూడు ఎకరాలు ప్రభుత్వానికి.. ఆరు ఎకరాలు రామాలయ నిర్మాణానికి దానం..

గిరి మహిళ  యోగేశ్వరి ఔదార్యం


గూడెంకొత్తవీధి(విశాఖ): సెంటు స్థలం కనిపిస్తే ఎలా ఆక్రమించేద్దామా అని చూస్తున్న ఈ రోజుల్లో, ఏకంగా తొమ్మిది ఎకరాల భూమిని దానం చేసి ఔదార్యం చాటుకుంది ఓ గిరి మహిళ. మండలంలోని లక్కవరం గ్రామానికి కంకిపాటి యోగేశ్వరి తనకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాలు ప్రభుత్వానికి, ఆరు ఎకరాలు రామాలయానికి దానంగా ఇచ్చారు. తన తల్లిదండ్రులు కంకిపాటి చేతిపదల్‌,చంద్రమ్మ జ్ఞాపకార్థంగా భూమి దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ రాముకు భూమి పత్రాలను యోగేశ్వరి దంపతులు అందజేశారు. యోగేశ్వరి దంపతుల  ఉదారతను మండలం ప్రజలు అభినందించారు.

Updated Date - 2020-06-25T19:24:20+05:30 IST