చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2020-12-03T05:44:59+05:30 IST

మండల కేంద్రమైన నక్కపల్లిలో ఓ వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున చీరకు నిప్పంటుకోవడంతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు మృతి
మృతి చెందిన నాగయ్యమ్మ (పాత చిత్రం)


నక్కపల్లి, డిసెంబరు 2 : మండల కేంద్రమైన నక్కపల్లిలో ఓ వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున చీరకు నిప్పంటుకోవడంతో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎస్సీ కాలనీలో ఉంటున్న ఎల్‌.నాగయ్యమ్మ (69) మంగళవారం రాత్రి తన పూరిగుడిసెలో నిద్రించింది. చలికి తట్టుకోలేక తన మంచం పక్కన కుంపటి పెట్టుకుంది. తెల్లవారుజామున నిద్రలేవగా చీరకు ఆ నిప్పంటుకోవడంతో శరీరం కాలిపోయి మృతి చెందినట్టు ఎస్‌ఐ అప్పన్న వివరించారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వేరొక గదిలో ఉన్నారన్నారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

Updated Date - 2020-12-03T05:44:59+05:30 IST