మహిళల్లో పెరిగిన అభద్రత
ABN , First Publish Date - 2020-11-27T04:50:31+05:30 IST
ప్రస్తుతం సమాజంలో మహిళలు అభద్రతతో బతుకీడ్చాల్సి వస్తోందని, తరచూ జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని దుర్గాభాయ్ దేశ్ముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఉష అన్నారు.

దుర్గాభాయ్ దేశ్ముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఉష
అక్కయ్యపాలెం: ప్రస్తుతం సమాజంలో మహిళలు అభద్రతతో బతుకీడ్చాల్సి వస్తోందని, తరచూ జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని దుర్గాభాయ్ దేశ్ముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఉష అన్నారు. ధరణి సంస్థ ఆధ్వర్యంలో విశాఖ నగరం అక్కయ్యపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో వివక్ష, గృహహింస వంటివి సర్వసాధారణమైపోయాయన్నారు. మహిళలకు సమాజంలో గౌరవం, సమాన హక్కులతో పాటు రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధరణి సంస్థ కార్యదర్శి బి.హరి, సభ్యురాలు పి.లీల పాల్గొన్నారు.