మన్యంలో కుండపోత
ABN , First Publish Date - 2020-09-12T10:23:47+05:30 IST
మన్యంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు

వాగులను తలపించిన రోడ్లు
సేదదీరిన గిరిజనులు
గూడెంకొత్తవీధి/సీలేరు/అనంతగిరిరూరల్/పెదబయలు, సెప్టెంబరు 11 : మన్యంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి, పెదబయలు, అనంతగిరి మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. సీలేరు పట్టణంలో భారీ వర్షం పడింది.
దీంతో ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతగిరి ఘాట్‌రోడ్డు గెడ్డను తలపించింది. వాహనాల రాకపోకలకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. దీంతో వాతావరణం చల్లబడి గిరిజనం వేడి నుంచి ఉపశమనం పొందారు.