8న సాదాసీదాగా ‘కొండగుడి పండుగ’
ABN , First Publish Date - 2020-12-06T04:56:04+05:30 IST
విశాఖలోని మేరీమాత కొండగుడి పండుగను ఈ ఏడాది కొవిడ్ దృష్ట్యా సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కొండల జోసఫ్, మీడియా ఇన్చార్జి జె.ఎల్.రవికుమార్ తెలిపారు.

డైరెక్టర్ కొండల జోసఫ్
డాబాగార్డెన్స్, డిసెంబరు 5: విశాఖలోని మేరీమాత కొండగుడి పండుగను ఈ ఏడాది కొవిడ్ దృష్ట్యా సాదాసీదాగా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కొండల జోసఫ్, మీడియా ఇన్చార్జి జె.ఎల్.రవికుమార్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మహోత్సవ కమిటీ కన్వీనర్ చిన్నప్పరెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జరిగే వేడుకల్లో తలనీలాలు సమర్పణ, మేరీమాత స్వరూపంతో తిరు ప్రదక్షిణ, పలు ఇతర సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. విశ్వాసకులను కేవలం మేరీమాత దర్శనానికే అనుమతిస్తామన్నారు. విశ్వాసకులు గుంపుగా కాకుండా ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ పర్యాయాలు జరిగే ప్రార్థనల్లో నిబంధనలు పాటిస్తూ పాల్గొనాలని సూచించారు. విశ్వాసకులు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలన్నారు. నవంబరు 29న ప్రారంభమైన వేడుకలు 8వ తేదీన జరిగే ప్రధాన పండుగతో ముగియనున్నాయి.