మంత్రి బాలినేనిని భర్తరఫ్ చేయాలి: కిడారి డిమాండ్
ABN , First Publish Date - 2020-07-18T10:15:18+05:30 IST
తమిళనాడులో రూ.5 కోట్లు పట్టివేత వ్యవహారంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

పాడేరు, జూలై 17: తమిళనాడులో రూ.5 కోట్లు పట్టివేత వ్యవహారంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు. చెన్నైలో ఉన్న వైసీపీకి చెందిన వారికి ఇచ్చేందుకు మంత్రి బాలినేని అనుచరులు తీసుకువెళుతుండగా ఆ సొమ్ము పోలీసులకు పట్టుబడిందన్నారు. ఈకేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు(ఈడీ)కి అప్పగించి మరింత లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు నుంచి దొంగ బంగారాన్ని మంత్రి బాలినేని అనుచరుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లోని బంగారు దుకాణాలకు సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి కిడారి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని కిడారి డిమాండ్ చేశారు.