-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » KATTAMANCHI JAYANTI
-
ఏయూలో ‘కట్టమంచి’ జయంతి
ABN , First Publish Date - 2020-12-11T05:06:05+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతిని గురువారం ఏయూలో ఘనంగా నిర్వహించారు.

ఏయూ క్యాంపస్, డిసెంబరు 10: ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతిని గురువారం ఏయూలో ఘనంగా నిర్వహించారు. పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న కట్టమంచి విగ్రహానికి వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో దార్శనికతతో విశాఖలో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దిన ఘనత కట్టమంచికే దక్కిందనికొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రొఫెసర్లు శ్రీనివాసరావు, రాజేంద్ర కర్మార్కర్, సుమిత్ర, భట్టి, తదితరులు పాల్గొన్నారు.