మార్గశిర మాసోత్సవాలకు పందిరి రాట

ABN , First Publish Date - 2020-11-26T06:01:47+05:30 IST

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో డిసెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్న మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి ఉత్సవ రాటను బుధవారం వేశారు.

మార్గశిర మాసోత్సవాలకు పందిరి రాట
ఉత్సవ రాట వేసి అమ్మవారికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే

వన్‌టౌన్‌, నవంబరు 25: కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో డిసెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్న మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి ఉత్సవ రాటను బుధవారం వేశారు. ఎమ్మెల్యే  వాసుపల్లి గణేశ్‌కుమార్‌ కార్యక్రమానికి హాజరై  అమ్మవారి ఆలయంలో జ్యోతి ప్రజ్వలనచేసి రాటవేసి పంది నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు జాకెట్టు ముక్కలు, తాంబూలం అందజేశారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T06:01:47+05:30 IST