అమ్మలగన్న అమ్మ కనకమ్మ
ABN , First Publish Date - 2020-12-15T06:28:52+05:30 IST
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, పాతనగరం బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
కనకమహాలక్ష్మి దేవాలయంలో నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, పాతనగరం బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.10 గంటలకు శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. గురువారం ప్రత్యేక పూజలు, మంగళవారం అష్టదళ పద్మారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో స్లాట్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.