నేటి నుంచి కనకమ్మ మార్గశిర ఉత్సవాల టికెట్లు

ABN , First Publish Date - 2020-12-07T05:56:28+05:30 IST

కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 15 నుంచి జరగనున్న మార్గశిరమాసోత్సవాల్లో అమ్మవారి దర్శనానికి స్లాట్‌ స్లిప్‌లు సోమవారం నుంచి జారీ చేయనున్నట్టు ఈవో ఎస్‌.జ్యోతిమాధవి తెలిపారు.

నేటి నుంచి కనకమ్మ మార్గశిర ఉత్సవాల టికెట్లు

రెండు చోట్ల స్లాట్‌ బుకింగ్‌ కౌంటర్లు

వన్‌టౌన్‌, డిసెంబరు 6: కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 15 నుంచి జరగనున్న మార్గశిరమాసోత్సవాల్లో అమ్మవారి దర్శనానికి స్లాట్‌ స్లిప్‌లు సోమవారం నుంచి జారీ చేయనున్నట్టు ఈవో ఎస్‌.జ్యోతిమాధవి తెలిపారు. ఉత్సవాల నెలరోజులు వచ్చే భక్తులకు ఉచిత దర్శనంతో సహా అన్ని రకాల దర్శన టిక్కెట్లు ముందస్తుగా జారీ చేయడం జరుగుతుందన్నారు. వన్‌టౌన్‌ కొత్తరోడ్డు జగన్నాథస్వామి దేవస్థానం, అంబికాబాగ్‌ రామాలయంల వద్ద స్లాట్‌ స్లిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ స్లాట్‌ స్లిప్‌లు కావల్సిన వారు వారి అధార్‌ కార్డులు తీసుకురావలని సూచించారు. మరిన్ని వివరాలకు 0891-2566514 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-12-07T05:56:28+05:30 IST