కన్నుల పండువగా జ్వాలాతోరణోత్సవం

ABN , First Publish Date - 2020-12-01T05:52:44+05:30 IST

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కొత్త వెంకోజీపాలెం గౌరీ జ్ఞానలింగేశ్వరాలయం వద్ద సోమవారం రాత్రి జ్వాలాతోరణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా జ్వాలాతోరణోత్సవం
గౌరీ జ్ఞానలింగేశ్వరాలయం వద్ద జ్వాలాతోరణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు

వెంకోజీపాలెం, నవంబరు 30: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కొత్త వెంకోజీపాలెం గౌరీ జ్ఞానలింగేశ్వరాలయం వద్ద సోమవారం రాత్రి జ్వాలాతోరణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. రాత్రి ఏడు గంటల తర్వాత ధ్వజ స్తంభం వద్ద ఆకాశజ్యోతిని వెలిగించారు. పల్లకీలో శివపార్వతుల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.  

Updated Date - 2020-12-01T05:52:44+05:30 IST