ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా రేపు

ABN , First Publish Date - 2020-12-08T05:24:24+05:30 IST

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీ బుధవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి(టెక్నికల్‌) సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.

ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా రేపు

కంచరపాలెం, డిసెంబరు 7: కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 9వ తేదీ బుధవారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి(టెక్నికల్‌) సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.  జయభేరి ఆటోమొబైల్స్‌ ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని సేల్స్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ పెయింటర్‌, పెయింటర్‌, సీనియర్‌ డెంటర్‌ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. ఇంటర్‌ లేదా డిగ్రీ, ఐటీఐ  పూర్తిచేసిన యువత మేళాకు హాజరు కావచ్చునని తెలిపారు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఔత్సాహికులు ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయానికి నేరుగా హాజరు కావాలని సుబ్బిరెడ్డి సూచించారు. 

 


Updated Date - 2020-12-08T05:24:24+05:30 IST