-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » jeedimamidi
-
జీడిమామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
ABN , First Publish Date - 2020-11-27T05:49:19+05:30 IST
జీడిమామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులను ప్రతీ రైతు చేపట్టాలని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రసాద్ అన్నారు.

కొయ్యూరు, నవంబరు 26: జీడిమామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులను ప్రతీ రైతు చేపట్టాలని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రసాద్ అన్నారు. గురువారం కొమ్మిక శివారు కర్నికపాలెంలో జీడిమామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త చిగురు కన్నా ముందు ఎండు కొమ్మలు, ఒకదానికొకటి ఒరుసుకుంటూ ఉన్న కొమ్మలు తొలగించాలని సూచించారు. కొమ్మలు తొలగించిన వెంటనే వేపనూనె సంబంధిత మందులను పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త వాన ప్రసాదరావు, మాజీ సర్పంచ్ అప్పారావు, వలంటీరు దేముడునాయుడు, రైతులు పాల్గొన్నారు.