రైతులను తక్షణమే ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-08T04:52:38+05:30 IST
నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్, బొలిశెట్టి డిమాండ్
సిరిపురం, డిసెంబరు 7: నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు, వరిదుబ్బులతో నిరనస వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరాకు రూ.35 వేల చొప్పున పంట నష్టం ఇవ్వాలని, కౌలు రైతులకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. తమ అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు త్వరలో జై కిసాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. నివర్ తుఫాన్ వచ్చి 15 రోజులు కావస్తున్నా వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడం దారుణమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒకరికొకరు దూషించుకోవడం తప్ప రైతుల వెతలపై ఎవరూ మాట్లాకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వన్నెంరెడ్డి సతీశ్‌కుమార్, బొడ్డేపల్లి రఘు, పీలా శివరామకృష్ణ, అంగ ప్రశాంతి, శివప్రసాద్, కరణం వీర్రాజు, అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు.