ఎటుచూసినా వనభోజనాల సందడే

ABN , First Publish Date - 2020-12-07T06:02:46+05:30 IST

వనభోజనాలకు వచ్చే వారితో కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కు, వలసంపేట గాదిగుమ్మి జలపాతం ఆదివారం సందడిగా మారాయి.

ఎటుచూసినా వనభోజనాల సందడే
వలసంపేట జలపాతం వద్ద పర్యాటకులు

కృష్ణాదేవిపేట, డిసెంబరు 6 :  వనభోజనాలకు వచ్చే వారితో కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కు, వలసంపేట గాదిగుమ్మి జలపాతం ఆదివారం సందడిగా మారాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత పార్కులోని అల్లూరి, గంటందొరల విగ్రహాలకు నివాళులర్పించి మధ్యాహ్నం సామూహికంగా భోజనాలు చేశారు. అనంతరం ఇక్కడికి సమీపంలోని జల పాతానికి వెళ్లి జలసౌందర్యాన్ని తిలకించారు. పిల్లలు, పెద్దలు జలకాలాడుతూ సరదాగా గడిపారు. 

Updated Date - 2020-12-07T06:02:46+05:30 IST