నేటి నుంచే జగనన్న విద్యా కానుక
ABN , First Publish Date - 2020-10-08T10:37:47+05:30 IST
‘జగనన్న విద్యాకానుక’ పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రారంభం కానున్నది. విద్యాకానుక కింద

జిల్లాలో 3,17,202 మందికి కిట్ల పంపిణీ
భీమునిపట్నం (రూరల్), అక్టోబరు 7: ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రారంభం కానున్నది. విద్యాకానుక కింద విద్యార్థులకు బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, మూడు జతల దుస్తులు, స్కూలు బ్యాగు, నోట్ పుస్తకాలను ఒక కిట్‌గా ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలోని అన్ని మండల పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 3,17,202 మంది విద్యార్థులకు ఇవి అందిస్తారు.
ఒక్కో కిట్ రూ.1,350 విలువైనదని అధికారులు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలల్లో కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఒక్కో పాఠశాలలో రోజుకు 50 మంది విద్యార్థులకు మించకుండా జగనన్న విద్యాకానుక పంపిణీ చేయాలని పేర్కొంది. ఆనందపురం మండలం గిడిజాలలో భారీగా కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా దృష్ట్యా కిట్ల పంపిణీ సమయంలో పలు జాగ్రత్తలను పాటించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.