సంక్షేమ ప్రభుత్వమిది: ఎంపీ సత్యవతి
ABN , First Publish Date - 2020-11-27T05:23:14+05:30 IST
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అన్నారు.

సబ్బవరం, నవంబరు 26: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అన్నారు. గురువారం స్థానిక మండల కార్యాలయంలో జగనన్న తోడు పథకాన్ని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌తో కలసి ప్రారంభించారు. మండలంలో 1219 మంది చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలందించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీడీవో రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, ఏవో షేఖ బాబూరావు, వైసీపీ నేతలు కొటాన రాము, అప్పారావు, ముత్యాలనాయుడు, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరిపాక నుంచి అయ్యన్నపాలెం శివారు దుడ్డవాక వరకూ నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.