-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ITI
-
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-21T05:40:18+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో తొలివిడత కౌన్సెలింగ్‌లో భర్తీకాక మిగిలిపోయిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ శుక్రవారం కంచరపాలెం పాత ఐటీఐలో ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు.

సర్వర్ తెరవక మూడు గంటలు ఆలస్యంగా ప్రక్రియ
అసహనానికి గురైన అభ్యర్థులు
కంచరపాలెం, నవంబర్ 20: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో తొలివిడత కౌన్సెలింగ్‌లో భర్తీకాక మిగిలిపోయిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ శుక్రవారం కంచరపాలెం పాత ఐటీఐలో ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు. అయితే తొలిసారి ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించడంతో అధికారులు, సిబ్బంది అవస్థలు పడ్డారు. ఉదయం 8 గంటలకే అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పదకొండు గంటల వరకు సర్వర్ ఓపెన్ కాకపోవడంతో అభ్యర్థులకు నిరీక్షణ తప్పలేదు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‌చేసిన విషయం తెలిసిందే. దీంతో సర్టిఫికెట్‌లో పాస్ అని మాత్రమే ఇచ్చారు. మార్కులు, గ్రేడింగ్ పాయింట్లు లేకపోవడంతో అధికారులకు ఇదో అదనపు శ్రమ తప్పలేదు. దరఖాస్తుదారులకు సంబంధించిన మెరిట్ జాబితాను ఎస్‌ఎస్‌సీ బోర్డు నుంచి ప్రత్యేకంగా తెప్పించి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రధాన ట్రేడులతోపాటు ఇతర ట్రేడుల్లో మిగిలిన సీట్లను మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులకు కేటాయించినట్లు ఐటీఐల కన్వీనర్ వై.ఉమాశంకర్ తెలిపారు.