అటవీ హక్కుల వివరాలు నమోదు చేయండి
ABN , First Publish Date - 2020-11-26T06:24:44+05:30 IST
ఏజెన్సీలో లబ్ధిదారులకు అందించిన అటవీ హక్కుల వివరాలను గిరి భూమి పోర్టల్లో నమోదు చేయాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్
పాడేరు, నవంబరు 25: ఏజెన్సీలో లబ్ధిదారులకు అందించిన అటవీ హక్కుల వివరాలను గిరి భూమి పోర్టల్లో నమోదు చేయాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. ఏజెన్సీలోని 11 మండలాల రెవెన్యూ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా అటవీ హక్కుల కల్పనపై మూడోసారి నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశంలో ఆమోదం పొందిన హక్కుల లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. రెవెన్యూ అధికారులు దీనిపై ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.