కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2020-12-13T06:10:33+05:30 IST

అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు.

కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలి
అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌


ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

హుకుంపేట: అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. విద్యార్థులు అబ్దుల్‌ కలాం రాసిన పుస్తకాలు చదివితే ఎన్నో విజయాలు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సోమేశ్వరరావు, సీఐ మీసాల కృష్ణమూర్తి, టి.సురేష్‌, మధుసూదన్‌, సాగరి రాజశేఖర్‌, జలుగు వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:10:33+05:30 IST