అర్హులందరికీ పథకాలు అందాలి

ABN , First Publish Date - 2020-12-06T06:16:42+05:30 IST

సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు.

అర్హులందరికీ పథకాలు అందాలి
పెదలబుడు-2 సచివాలయంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్‌

ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్‌

అరకులోయ, డిసెంబరు 5: సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందాలని ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని పెదలబుడు-2 సచివాలయాన్ని ఆయన సందర్శించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. తోడు పథకం కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబుచ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాంబాబు పలు పథకాల లబ్ధిదారుల జాబితాల గురించి పీఓకు వివరించారు.

Read more